శ్రీదేవిలా నా జీవితంలో ప్రవేశించి,
అభిమానం, ఆప్యాయత అంటే ఏమిటొ నాకు తెలిసేలా చేసి,
ఓ రాధలా నా హ్రుదయంలో ప్రవేశించి,
ప్రేమ అనే అమృతం లో నన్ను నిలువెల్లా పులకరిచేలా చేసి,
నీవే నా ప్రాణం, నీవే నా సర్వం అని నను నేనే మరచిపొతున్న క్షణం ...
జ్యోతిర్మయివై నను ఈ ఎడారిలో ఒంటరిగా విడచి వెళ్ళిపొతున్నావా!
ఓ నా ప్రాణమా, నను వీడకు
అని వెర్రి కేకలేస్తున్న నా హ్రుదయ రోదన నీ దరి చేరటం లేదా!
నీ కోసం వెదికే నా కన్నులను అడుగు..
భగవంతుని విశ్వరూప దర్శనం కంటే అహ్లాదకరమైనది ఏమిటో చెప్తుంది,
నీ స్పర్శకై వెంపర్లాడే నా చేతిని అడుగు..
ఎన్ని జన్మలనుంచి నీకై వేచి ఉన్ననో.. నా హ్రుదయం చెప్తుంది.
నా శ్వాస వీడేలోపు నా దరి చేరగలవా?
మరుజన్మనైనా కరుణిస్తావా, ఈ క్షణమే మరణిస్తాను.
ఓ నా ప్రాణమా, నను వీడకు...
Tuesday, October 27, 2009
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment