నను క్షమించు...
నా కోసం తెలుసుకోవడానికి ప్రయత్నించకు..
నను నేను వెదుక్కుంటూ... బయలుదేరుతున్నా!..
ఇది నా చివరిమాట..
నిను మరొక్కసారి తప్పకుండా కలుస్తాను.(ఎప్పుడో చెప్పలేను.)
ఈ బ్లాగ్ చివరి పొస్ట్ నుంచి చదువు..
నిను బాధ పెట్టలని నాకు లేదు, కానీ...
ఎక్కడో చదివాను,
"జీవితంలో ఎన్నదగిన ప్రశ్నలు నాలుగే నాలుగు.
ఏది పవిత్రం?
ఏది ఆత్మకు మూలం?
దేనికోసం జీవించాలి?
దేనికోసం మరణించాలి?
ఈ ప్రశ్నలన్నిటికీ కలిపి ఒకటే జవాబు ఉంది -
ప్రేమ, స్వచ్చమైన ప్రేమ."
నిజం తెలుసుకో!
నిను బాధపెడుతుంటే, నన్ను క్షమించు.
నువ్వు జాగర్త!
:) మనస్పూర్తిగా నను చేరగలిగినపుడు, నా రాధిగా రాగలిగినపుడు...
నను చేరుకో...
అంతవరకు.... నేను నీకు కనపడను, వినపడను...
ప్రేమతో..
నీ...
Sunday, November 8, 2009
Friday, November 6, 2009
బాధ...ప్రేమ...ఎడబాటు...నిజం...జీవితం...
బాధ...
ఏమని చెప్పను? ఎలా చెప్పను?
బాధ అంటే ఏమిటొ!
అనుభవించే నీ మనసుని అడుగు, భరిస్తున్న నన్ను అడుగు,
మాటల్లో చెప్పలేనిది, మరపురానిది, మరువలేనిది..
ప్రేమ...
అర్థం చెప్పటానికి ఎందరో మహామహులు ప్రయత్నించారు,
అనుభవిస్తేకాని అర్థం కానిది, అర్థం చేసుకోలేనిది
నీ మనసుని అడుగు, నా హ్రుదయాన్ని అడుగు,
నిజం ఏమిటొ మనకు తెలుసు. :)
ఎడబాటు...
మన భగ్న హ్రుదయాలే సాక్షిగా ఈ ప్రపంచం ఆడుతున్న నాటకంలో సమిధలై బూడిదవుతున్న మన హ్రుదయాలని అడుగు..
ఎడబాటు ఎంత భయంకరమైన సత్యమో చెపుతాయి...
నిజం...
నన్ను అడుగు, నా పగిలిన మనసుని అడుగు,
పెంచుకున్న ప్రేమ కళ్ళముందే కనుమరుగవుతున్నప్పుడు నిజం ఎంత కఠినంగా ఉంటుందో!
ప్రాణం కన్నా మిన్నగా చుసుకునే నిన్ను...
నా కళ్ళముందు కదలాడుతూ ఉన్నా,
నిను ముట్టుకోలేను అనేది నిజం!
నీతో మాట్లాడలేను అనేది నిజం!
నిను నా దరికి చేర్చుకోలేను అనేది నిజం!
నా మనసు నిను చేరుకోవడానికి వెంపర్లాడుతున్నా, నువ్వు రాలేవన్నది పచ్చినిజం,
ఎలా భరించను?
జీవితం...
నీకు నీకుటుంబం, నీ బంధాలు వున్నాయి..
నీకు జీవించడానికి, ఎన్నో కారణాలు ఉన్నాయి,
మీ నాన్న , మీ అమ్మ, మీ అక్క, మీ చెల్లి...
మరి నేను?
అందరూ వదిలేసినా ఏకాకిని,
బతికి వున్ననో లేదో అని ఎవరూ కూడా పట్టించుకోని ఒక ప్రాణిని,
బతికి ప్రయోజనం ఉందా?
కానీ నాకు చచ్చిపోయెటంత ధైర్యం లేదు, బతకాలనే ఆశ లేదు,
ఏమి చేయాలి?
ఈ కుళ్ళు సమాజంకోసం..
నేనెందుకు పాటుపడాలి?
నేనెందుకు సేవ చెయాలి?
నేనెందుకు జీవించాలి?
ఎవరికోసం?
ఎందుకోసం?
ఏమి సాధించడానికి?
ఏమి చెయ్యడానికి?
అర్థం కాని, అర్థం లేని ప్రశ్నలు ఎన్నో ...
...
ఏమో!
ఆ భగవంతుడు ఆడే ఈ నాటకంలో నాచే ఎమిచేయిస్తాడో! చూడాలి.

నీకై, వేచి ఉంటా!
నీ మాటకై నా ఈ రెండు రోజుల ఎదురు చూపుల ఫలితం,
ఈరోజు నీతో గడపిన సమయం చాలు..
ఈ జీవితం గడపటానికి,
నీ నోటి నుంచి వచ్చిన "I Really MISS YOU raa " ఆ మాటచాలు..
నీకోసం మరుజన్మదాకా వేచి వుండటానికి.
బరువెక్కిన హ్రుదయంతో,
ఎంతో మాట్లాడాలని, ఏదో చెప్పాలని ఎంత ఎదురుచూసినా..
గొంతు పెగలక, మాటరాక,
నిను చూస్తూ, నీ చిరునవ్వులను ఆశ్వాదిస్తూ.. నను నేనే మరచి.. ఏమి చెప్పానో !
నిన్నేమన్నా బాధపెట్టి వుంటే నన్ను క్షమించు.
:)
నీ కుటుంబ గౌరవం కోసం నువ్వు పడే తపన,
నీ కోసం ఏమీ వద్దనుకునే నీ త్యాగం..
నను ఇంకా బాధపెట్టకుండా ఉండటానికి, నీ మేకపోతు గాంభీర్యం,
మధ్య నీ కళ్ళలో " ఆ బాధ " ను నా హ్రుదయం కనిపెట్టేశింది.
నువ్వేమీ దిగజారిపోలేదు, నా హ్రుదయంలో ఎంతో ఎత్తుకు ఎదిగిపొయావు...
నేను నిను చేరుకోలేనంత దూరం!
ఆశకు కూడా అందనంత దూరం!
ఈ జన్మకు నిను చేరలేనేమో!
ఏమి చెయ్యగలం?
ఈ కుళ్ళు సమాజం,
మన ప్రేమను విడదీశింది.
కారణం,
---
మహాభారతంలో భీష్మాచార్యుడు ధర్మరాజుకు ధర్మశాస్త్ర సమ్మతమైన వివాహాలను గురించి చెప్పినవి న్యాయమేనా!
హిందూమతమునకు ప్రామాణ్యము వేదాలు అని అందరికీ తెలుసు. భగవధ్గీత 4వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు “చాతుర్వర్ణ్యం మయాసృష్ట్యం గుణకర్మ విభాగశః”అన్నాడు.దీని అర్థం”మొదట వారి గుణాలబట్టి,తర్వాత వారు చేసే పనులబట్టి నాలుగు వర్ణాలు(కులాలు) నాచే(భగవంతుడిచే) సృష్టింపబడ్డాయి.“అని అర్థం. వేదాలలో నాలుగు వర్ణాల (కులాల)గురించి చెప్పారు కానీ వాటిమధ్య ఎక్కువ,తక్కువల గురించి చెప్పలేదు.
నిజమైన ఆత్మానుభవం పొందిన వారి ఉపదేశాలకు,శాస్త్ర వాక్యాలకు వైరుధ్యమేర్పడినప్పుడు ఆత్మవేత్తల(ఆత్మానుభవం పొందినవారు)మాటే వినమని ధర్మశాస్త్రాలు చెపుతాయి.
---
నిజం! తెలుసుకోవడం కష్టం.. కానీ,
వేదకాలం నుంచి ఓ ఆడదాన్ని ఎంతలా అణగదొక్కారో,
కళ్ళతో చూసిన నీకు తెలుసు,
ఇప్పటికీ, నీవు ఆ మూఢ ఆచారాల మధ్యే కొట్టు మిట్టాడుతున్నావా?
నువు చేసేది తప్పు కాదు, కానీ..
నీకోసం, నీ జీవన మనుగడకోసం, ఏమి చేస్తున్నావ్? అవి సరిఏనా?
:)
తెలిసి తెలిసీ, నిను తన ప్రాణం కన్నా మిన్నగా ఆదరించే, నను ఏది ఇంతలా దూరం ఏలా చేసుకోగలుగుతున్నావు?

నీ సాయిబాబాను అడుగు :)
ఏది ఏమైనా..
ఏది ఎలా జరిగినా..
నా హ్రుదయంలో నుంచి నీ రూపం చెరిగిపోదు, చెరపలేవు..
నాకోసమై ఈ కట్టుబాట్లను, ఈ సమాజాన్ని, ఈ ప్రపంచాన్ని ఎదిరించి..
నా రాధివై నను చేరతావనే ఆశతో!
నీకై, వేచి ఉంటా!
ఇంకా నా హ్రుదయం చెపుతుంది,
నను వెదుక్కుంటూ, తప్పకుండా నను చేరతావు అని..

Wednesday, November 4, 2009
నీ....
నువు రావని తెలుసు, రాలేవని కూడా తెలుసు..
ఐనా ఎందుకో నాకీ బాధ!
మనం అనే పదం నా జీవితంలోకి మళ్ళీ రాదేమో! అనే భావన నను నిలువెల్లా దహించి వేస్తుంటే...
నిను వెంటాడలేక, నీతో మాట్లాడలేక, నిను చూడలేక..
నాబాధను ఎవరితో చెప్పుకోలేక..
నా హ్రుదయం ఉక్కిరిబిక్కిరి అవుతూ..
నా కన్నీరు ఎవరి కంటా పడకూడదని, అలా ఒంటరిగా బయలుదేరిన నాకు...
"ఏమైందిరా!" అనే పిలుపు వినపడి వెనక్కు తిరిగి చూస్తే..
నా వెనుక ఎవరూ లేరు...
ఇది నా భ్రమా! అనుకుని అలా ప్రయాణం సాగిస్తూ ఉండగా...
మధ్యలో "తిన్నావా?" అని నువ్వడిగినట్లు నాకు అనిపించి "ఆకలి లేదురా!" అని చెప్పి చుస్తే... "
నిజం, నేనొక్కడినే మాట్లాడు కుంటున్నాను.. :)
నీ తలపులతో ఒంటరిగా కుర్చున్న నాకు, ఏమి చేయ్యలో తెలియక అలా చూస్తూ ఉండగా...
నా కళ్ళు ధారలై ప్రవహించి, నా భగ్గుమంటున్న నా హ్రుదయ వేదనను కొంచెం చల్లార్చాయి..
ఏమో తెలియదు, ఎందుకో కూడా తెలియదు..
ప్రస్తుతం, నేను నేనులా లేను...
నన్ను నేను చూసుకుంటే.. నేనేనా! అన్న ప్రశ్న...
నీ ఎడబాటును నేను భరించలేనెమో!
ఆశలు చంపుకున్న నాలో తిరిగి ఆశలు రేపావు,
నను వీడను అని, నను విడుస్తున్నావు,
నాతోడుగా ఉంటానని, నను ఒంటరిగా వదిలేస్తున్నావు..
నా మీద నీకు "ప్రేమ మాత్రం లేదు" అని నువ్వు చెప్పిన చేదు నిజం...
:)
నేను భరించలేక పోతున్నా...
ఒక్క మాట.." ప్రేమ ఉంది " అనే మాటకోసం ఎదురుచూస్తూ...

రేపు ఎలా మట్లాడుతానో...
నిజం తెలుసుకోవాలనే నా తపన,
నిను నీడలా వెంటాడేలా చేస్తుంది.
ఇంకా చావని నీపై నా ప్రేమ,
నీకు తోడుగా ఉండాలని ఉవ్విళ్ళూరుతుంది.
నీతో ఎలా ఉండాలి అనే నా ప్రశ్నకు సమాధానం లేదు..
ప్రేమతోనా ! లేక స్నేహంతోనా!
మనమధ్య వున్న బంధం ఎటువంటిదో, ఆ భగవంతుడికే ఎరుక...
నిజం పూర్తిగా చెప్పలేని, చెప్పాలనిలేని నిన్ను ఏమి అడుగను?
ఎన్ని సార్లు అడిగినా, నీకు అన్నీ చెప్పాను, ఇంకా చెప్పడానికి కొత్తగా
ఎమీ లేవు అనే నీ సమాధానం వెనుక.. నీ గుండెలోతుల్లో దాచుకున్న బాధను
తెలుసుకొవాలి అనే నా ఆరాటం నీకెలా చెప్పలి?
నీ జీవిత విజయం కోసం నే పడే తపన నీవెప్పుడు అర్థం చేసుకుంటావు?
అయినా నేనేందుకు నీ విజయం కోసం ఇంత తపన పడుతున్నాను! (ఈ ప్రశ్నకు సమాధానం నీ హ్రుదయం చెప్తుంది).
ఒకటి మాత్రం నిజం..
ప్రేమ గుడ్డిది,
మన మధ్య వున్నది ప్రేమ కాదేమో!
ఈ ప్రశ్నకు నా హ్రుదయం కన్నీటితో చెపుతుంది,
ఒకరికోసం మరొకరు జీవించలేనిది, ప్రేమ కాదు అని,
తన జీవితంలో ముఖ్యమైన విలువ ఇవ్వలేనిది, ప్రేమ కాదు అని,
పంచుతున్న ఆత్మీయతను అర్థం చేసుకోలేనిది, ప్రేమ కాదు అని,
అనురాగంతో పరవశించలేనిది, ప్రేమ కాదు అని,
పరిస్థితులకు భయపడేది, ప్రేమ కాదు అని,
పరిస్థితులకు తలవంచేది, ప్రేమ కాదు అని,
అర్థం చేసుకోలేని ప్రేమ, ప్రేమే కాదు అన్న నిజం నీవు తెలుసుకున్నావేమో!
నిజమే నా ప్రేమే గుడ్డిది..
గుడ్డిగా నమ్మాను, నమ్ముతున్నాను,
అర్హతలేకుండా ఆశ పడ్డాను,
"నాకు కూడా బాధ ఉంది
అలా అని నేను మళ్ళీ వెనక్కి రాను, రాలేను
ఐనంత మాత్రాన, నువ్వు ఫీల్ ఐనవన్నీ నిజాలవుతయా?
ఎవరొ ఒక పనికిరాని చెత్త అమ్మయి వదిలెస్తే నువ్వు ఫూల్ ఐపోతావా?
నా గురించి అలోచించడం మానేసెయ్"
:) నీకెందుకు బాధ?
నీగురించి అలోచించడం ఎలా మానాలి?
ప్రతీ క్షణం, నీదే ధ్యాస,
నేను బతికి ఉండగా నాకు సాధ్యం కాదేమో!
కలలు కంటే సరిపోదు, నిజం చేసుకోవాలనే తపన నా సొంతం..
ఫీల్ ఐతే, అలా ఫీల్ అవడానికి ముందే ఒకసారి అలోచిస్తాను, నిజం
చేసుకోగలనా లేదా అని,
నిజం చేసుకోగలను అనిపించినప్పుడే ఫీల్ అవుతాను..
ఇప్పుడు నిజం నాకు తెలుస్తుంది... :)
చప్పట్లు కొట్టడానికి ఒక చెయ్యి సరిపోదని..
జీవితం ఆనందమయం చేసుకోవడానికి ఒక ప్రాణం సరిపోదని...
నా జీవిత ప్రయాణం లో సగం చేరిన నేను,
వెనక్కు తిరిగి చూస్తే...
అంతా అయోమయం....
నేను చేసిందేమిటి? అనే ప్రశ్న నను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది...
:) గడచిన కాలం తిరిగిరాదు, నిజమే...
జీవించాలి అనే తపన ఉంది, కానీ ఎలా?
ఆకలి, దాహం అనేవి నాకు తెలియట్లేదు..
ఏమో అవికూడా నను విడచి వెళ్ళిపొయాయేమో!
పగలు, రేయి అర్థం కావడం లేదు..
ఎవరిని చూసినా, నన్ను గేలి చేస్తున్నట్టుంది..
నా అనేవారు, నాకెవరూ లేరు...
అందరూ నన్ను వదిలేసారు..
నిరాస నిస్ప్రుహల మధ్య ఈ జీవన నావను ఎలా నడుపను?
ఒక మనిషిగా జీవించడానికి, ముఖ్యమైన అర్హతలన్నీ కొల్పోయానేమో!
నా ప్రేమను నువ్వు భరించలేవు!
నను చేరలేవు, నా ఒడిలో హాయిగా నిదురపోలేవు..
ప్రేమను ప్రేమతో చూస్తే తెలుస్తుంది, నిజమైన ప్రేమ అంటే ఏమిటో!
నేను నిన్ను అంతగా ఇష్టపడుతున్నాను అని,
అప్పుడున్న పరిస్థితికి ఎంచెప్పలో తెలియక,
నను వలచాను అని మాత్రం చెప్పవు కదా?
ఏమో రేపు నీతో ఎలా మట్లాడుతానో..
నువ్వెలా అర్థం చేసుకుంటావో చుడాలి..
నేను ఓ పిచ్చి వాడిలా నీ వెంటపడుతున్ననేమో కదా!
రేపు నువ్వేం చెప్తావో అని ఆశతో ఎదురు చుస్తున్నా...
నిజం తెలుసుకొని, నను వెదుక్కుంటూ,
నా రాధివై నా దరి చెరతావు అనే చిన్న ఆశతో..

Monday, November 2, 2009
నిను చూడాలనే ఆశతో....
నిను మరొకసారి చూడాలనే ఆశతో
ఏడు గంటల ఎదురుచూపులు, అడవికాసిన వెన్నెలైపోయిందే అన్న నిరాశతో తిరిగి వెల్తున్న నాకు,
నీ ప్రాణమిత్రుడు కనపడినప్పుడు,
తప్పకుండా నువ్వుకూడా కనిపిస్తావు అనే ఆశ నాలో మళ్ళీ జీవం పోసుకుంది.
నీకోసం ఎదురుచూస్తూ, నీ మాటకై వేచి ఉన్న నాకు నీవు
మహాలక్ష్మిలా చీరలో కనపడి క్షణం.
నను నేనే మైమరచి నీ వెనుకే నిను నీడలా వెంటాడుతూ... వస్తూ ఉండగా!
నను వీడని నా గతం, నాకు గుర్తు చేసింది.. మొదటి సారి చీరలో నాతో బయటకు వచ్చిన సంగతి.
:) ఏమి చెయ్యను?
నాతో మాట్లడవు, నను కలవవు, కనీసం నను చూస్తావేమో అని నీ పక్కకు వచ్చినప్పుడు.. నీ కల్లలో ఆ చిరాకు... నను నిలువెల్లా దహిస్తుంటే..
మళ్ళీ నిను వెంటాడలేక వెళ్ళిపోయాను...
:) నువ్వు ఇంటికివెళ్ళాక ఒక SMS అన్నా పంపిస్తావేమో అని చూసిన నాకు మళ్ళీ నిరాశే మిగిలింది.
నీ SMS కూడా రాదని తెలిసినా... ఇప్పటికీ చూస్తున్నా.. :)
ఇపుడు నా హ్రుదయం నను గేలి చేస్తూ నను అడుగుతుంది..
"మరీ ఇంత బండరాతినా నువ్వు ప్రాణం కన్న మిన్నగా ప్రేమించింది?" అని

ఎలా చెప్పను? ఏమని చెప్పను?
ఎలా చెప్పను? ఏమని చెప్పను?
ఈరోజు క్షణమైనా కలుస్తావని ఆశ పడ్డాను..
అది అడిఆశే అయింది.
మాట్లాడుతావేమో అని ఎదురుచూస్తున్నా...
అది కూడా కలే అవుతుందేమో!
నా జీవితంలో మరువలేని రోజు...
తిధి మరియు వారం ప్రకారం..
నా పుట్టిన రోజు..
నీతో కలసి జరుపుకోవాలనే చిన్ని ఆశ... :)
కనీసం నీ చిరునవ్వుల జల్లుతో నిలువెల్లా పులకరించాలనే చిన్ని ఆశ...
ఆశ తీరక, ప్రేమ చావక, బతకలేక, చావలేక..
కన్నీటి ధారల మధ్య, బరువెక్కిన హ్రుదయంతో గడుస్తుంది.
ఈ భరువు ఇక మోయలేనేమో!
గతం నన్ను వెక్కిరిస్తుంది,
లోకం నను గేలిచెస్తున్నట్టుంది,
నా అంతరాత్మ నను అవమానిస్తుంది,
నేను అనే అహం నను నిలువెల్లా ఆవహిస్తుంది,
నేను ఈ కుళ్ళు సమాజంలో బతకలేనేమో అని వేలెత్తి చూపి గేలి చెస్తున్నట్టుంది.
ఏమి చెయ్యను? ఎలా చెయ్యను?
జీవితాంతం నా తోడు ఉంటానని, మధ్యలోనే నను విడుస్తున్నావు.
నీకోసం నా జీవితాన్ని గెలవాలన్న నా కోరిక..
ఇప్పుడు గేలిచేస్తూ అడుగుతుంది.. :)
ఎవరికోసం? ఎందుకోసం? అని....
నేటికి 30 సంవత్సరాలు గడపిన ఏమీ చెయ్యలేని, ఏమీ సాధించలేని ఓ చేతకాని వాడిని...
ఎవరికోసం చెయ్యలి?
దేనికోసం చేయ్యాలి?
ఏమి సాధించాలి?
డబ్బా? - ఆశలేని వాడిని, అది నాకు తోడుండదు... అది నాకెందుకు?
పరువా? - నా పుట్టుకతోనే ఈ సమాజం దాన్ని చంపేసింది... ఎంతచేసినా నా పరిస్థితి అంతే..
పేరా? - ఎందుకు?
మరేం సాధించాలి?
ఏదో సాధించాలి అనే తపనతో,
ఈ సమాజం మీద కసితో,
నీ జ్ఞాపకాలే తోడుగా,
నీ ఊసులే నా ఆసరాగా,
ఈ భగ్గుమంటున్న హ్రుదయ కార్చిచ్చుని గుప్పిటపట్టి,
ఒంటరిగా...
నా ఈ గమ్యం లేని ప్రయాణం...
నేడే.. మొదలు పెడుతున్నా...
ఎమి ఎంత సాధించినా!
నీ దగ్గర నేను ఓడిపోయాను, ఇది నిజం!

Sunday, November 1, 2009
ఎలా చెప్పను?
నిను ఒక్కసారి చూడాలి అని ఎంతో ఆశగా వున్నా...
నిన్నెలా చూడాలో అర్థం కాక... ఏమీ చెయ్యలేని నిశ్రుహ నన్నావరించి... ఏమి చేయ్యాలో అర్థంకాని పరిస్థితిలో నా హ్రుదయం చెప్పింది.. నువ్వు తప్పకుండా కనిపిస్తావని!
నిజం!... నా హ్రుదయం నాకు తప్పు చెప్పలేదు.. :)
చిన్నపిల్లల కేరింతల మధ్య అలా పచ్చగడ్డిలో కూర్చున్న నిన్ను చూసిన నాకు..
నేను నిజం చెయ్యాలనుకున్న నీవు చెప్పిన కల నామదిలో మెదిలి నా మదిని కలవరపెడుతుంటే!
నాకళ్ళు నిను చూస్తూ, కొన్ని నీటి చుక్కలు విడుస్తూ నా మదిని అంతగా కలవరపడకు.. అని ఊరుకోబెడుతున్న క్షణం ... ఆ అనుభూతిని మాటల్లో ఎలా చెప్పను?

ప్రేమతో!...
అర్థరాత్రి కలత నిద్రలో ఉలిక్కిపడి లేచాను.. ఏమైందా అని అలోచిస్తే...
నీ జ్ఞాపకాలతో...
నిను నా పక్కనే ఉన్నట్టు ఊహించుకుని విహరిస్తుండగా..
కంటినిండా నీటితో నువ్వొచ్చి.. నను గట్టిగా పట్టుకొని కొడుతున్నావు...
అది ఏమిటొ.. కోపమా! ప్రేమా! లేక బాధా!
కలలో కూడా నను నీతో ఆనందంగా ఉండకూడదేమో! అనే ఊహ
నా గుండెలోతుల్లోనుంచి ఉబికివస్తున్న బాధ నీటి చుక్కలై నా కంటినుంచి వరదలా ధారలై ప్రవహిస్తూ ఉండగా... ఓ రాత్రి గడచిపోయింది..
నీ మాట వినాలని ఎంతో ఆశగా ఉన్నా... నీకు ఇష్టం లేకుండా నీతో నేనెలా మాట్లాడగలను?
"ఇలా ఉండి నను ఇంకా ఎక్కువ బాధ పడేలా చేస్తున్నవు" - అన్న నా మెసేజి చూసిన నువ్వు నాకోసం ఫోన్ చేసి కాసేపు మాట్లాడి, ప్రతీ రోజూ ఒక్కసరైనా నాతో మట్లాడుతానని మాట ఇచ్చావు.. :)
ఏమో! నాతో మళ్ళీ మాట్లాడుతావో లేదో.. నీకే తెలియాలి... ఐనా
నీ ఫోన్ కోసం ఎదురుచూస్తూ ఉంటాను.
నీకు ప్రేమంటే ఏమిటొ తెలియనప్పుడు "నను ప్రేమించాను" అని చెప్పావు..
ఇపుడు అదే ప్రేమ నీ గుండెలను పిండి చేస్తూ... కన్నీటి ధారలు కురిపిస్తున్నా దానిని ఎందుకు గుర్తించడం లేదు?
నాకు తెలిసిన ప్రేమంటే, కలసి జీవించడం ఒక్కటే మార్గం కాదు..
ఒకరికోసం మరొకరు జీవించడం..
నను ఇంకా బాధ పెట్టకూడదని, నీ బాధ దిగమింగుకుంటున్నావా?
చెప్పుకోలేక, ఏమి చేయ్యలేక,నను మరువలేక, నను వీడలేక నాతో ఉండలేక...
నేనే నిను దూరం చేసుకొనేలా చేస్తున్నవు కదా!
నాతో మాట్లాడవు - ఎమి? నాతో మాట్లాడుతే నీలో దాచిపెట్టుకున్న ప్రేమ ఎక్కడ బయటపడుతుందో అని భయమా?
నను కలువవు - ఎమి? నను చూసి నీ కన్నీటిని ఆపుకోలేనని భయమా?
నా ఈ తపస్సులో! నాపై నీకున్న ప్రేమను నువ్వు తెలుసుకునేలా చేసి నా దరి చేర్చుకుంటాను.

Saturday, October 31, 2009
నీకోసం...! కాదు ... నా ప్రాణం కోసం...
మళ్ళీ రాకూడదు అనుకుని వెళ్ళి పోయిన నేను తిరిగి వచ్చాను...
చిగురంత ఆశతో... నీకోసం
నీ ప్రేమను గెలవటానికి కాదు, నా ఆశను బతికించుకోవటానికి...
ప్రతీ క్షణం ఒక యుగంలా గడుస్తున్నా....
వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నా... నీ సందేశం కోసం...
నీనుంచి ఫోన్ రాదని తెలిసినా... నా రాధి నాతో తప్పకుండా మాట్లడుద్ది
అనే చిరు ఆశతో...
నీ కోసం అక్కడే ఎదురుచూస్తూ... నీ తీపి జ్ఞాపకాలతో తిరిగి వచ్చా ఇప్పుడే..
ఎదురు చూస్తున్నా...
ఎడారిలో ఒయాసిస్సు కోసం.. తిరిగి రాని నా రాధి కోసం..
నా ప్రాణం కోసం...

Wednesday, October 28, 2009
నీకు తెలుసా?
నిను కలవాలని, వేయికళ్ళతో ఎదురుచూస్తున్న సమయం "నిను కలవొచ్చా?" అన్న నీ ప్రశ్న... :)
నను కలచివేసింది.. నేనో పరాయి వాడిని అనే నీ భావన నన్నెంతగా బాధిస్తుందో..
నీకు తెలుసా?
నను కలసిన క్షణం నుంచి, నీ కళ్ళలో కదులుతున్న నీటి పొరలు నా దృష్టి నుంచి తప్పించుకోలేక పోయాయి..
నను ఇంకా బాధించకూడదు, అనే నీ భావం నాకు పూర్తిగా అర్థం అయింది..
నను బాధించకూడదు మరియు ఒక కూతురిగా నీ కర్తవ్యం నిర్వర్తించడానికి " నా " అనే భావనే బలి చేస్తున్నవా?
నా మీద ప్రేమ మాత్రం లేదు, మరి బాధ ఎందుకు?
అసలు ప్రేమంటే ఏమిటో...
నీకు తెలుసా?
:)
వీలైనంత ఎక్కువ కాలం నీతో గడపాలిని నాకున్నా.. కాలం కలసి రాలేదు, రావట్లేదు.... నీవు రానివ్వట్లేదు కూడా...

Tuesday, October 27, 2009
ఆశ తో...
నిను చూడాలని వెతికిన ఈ కనులు ముందు నువ్వు కనపడిన క్షణం,
నీటిపొరలతో నా కళ్ళు మసకబారిపోయాయి.
ఎంతో ఉద్వేగంతో యేదో చెప్పాలి, ప్రేమతో నిను తాకాలి అని నా హ్రుదయం ఉవ్విళ్ళూరుతున్న ఆ క్షణం,
భీకర నాదం చేస్తున్న నా గుండె చప్పుడుల మధ్య మాటరాక నాగొంతు మూగబోయిన ఆ క్షణం,
నా ప్రాణం నా కళ్ళముందు నుంచి కదలిపోతుంటే....
ఇంకెప్పుడూ కలవదేమో, మాట్లాదేమో అనుకొంటూ నా హ్రుదయం మొద్దుబారి, వెర్రికేకలు వేస్తున్న సమయం....
నీ నుంచి వచ్చిన Call...
తొలకరి చిరుజల్లులా నను ఓలలాడించింది..
నీ గంభీరమైన మాటల మధ్య, నీగొంతులో వినిపించిన బాధ... నాలో తిరిగి ప్రాణం పోసింది.
రేపు కలుస్తాను అన్న నీ మాట.. రేపటి కోసం ఏదురు చూసేలా చేసింది...
రేపు నువ్వేం చెప్తావో.. అన్న ఆశ తో..

నా ప్రాణమా, నను వీడకు...
శ్రీదేవిలా నా జీవితంలో ప్రవేశించి,
అభిమానం, ఆప్యాయత అంటే ఏమిటొ నాకు తెలిసేలా చేసి,
ఓ రాధలా నా హ్రుదయంలో ప్రవేశించి,
ప్రేమ అనే అమృతం లో నన్ను నిలువెల్లా పులకరిచేలా చేసి,
నీవే నా ప్రాణం, నీవే నా సర్వం అని నను నేనే మరచిపొతున్న క్షణం ...
జ్యోతిర్మయివై నను ఈ ఎడారిలో ఒంటరిగా విడచి వెళ్ళిపొతున్నావా!
ఓ నా ప్రాణమా, నను వీడకు
అని వెర్రి కేకలేస్తున్న నా హ్రుదయ రోదన నీ దరి చేరటం లేదా!
నీ కోసం వెదికే నా కన్నులను అడుగు..
భగవంతుని విశ్వరూప దర్శనం కంటే అహ్లాదకరమైనది ఏమిటో చెప్తుంది,
నీ స్పర్శకై వెంపర్లాడే నా చేతిని అడుగు..
ఎన్ని జన్మలనుంచి నీకై వేచి ఉన్ననో.. నా హ్రుదయం చెప్తుంది.
నా శ్వాస వీడేలోపు నా దరి చేరగలవా?
మరుజన్మనైనా కరుణిస్తావా, ఈ క్షణమే మరణిస్తాను.
ఓ నా ప్రాణమా, నను వీడకు...

Monday, October 26, 2009
అదే ప్రేమతో
కన్నీటి ప్రవాహానికి, ఎదురొడ్డి నీవు లేని నా జీవన నావలో ఒంటరిగా పయనిస్తున్నాను..
ప్రతీ క్షణం, ఒక యుగం,
ప్రతీ రాత్రీ, ఓ వింత అనుభవం,
కనులు మూస్తే, నీ చిరు నవ్వుల మోము నా కనుల ముందు కదలాడుతూ వుంటుంది,
నీ చిరు నవ్వుల సవ్వడి వినపడుద్దేమో అని చూస్తే,
నా హ్రుదయాన్ని కోస్తున్న శబ్ధం :)
ఏ మాత్రం నొప్పి తెలియట్లేదు, హాయిగా వుంది....
నా ఈ గాయ పడిన హ్రుదయాన్ని, నీ జ్ఞాపకాలతో బంధించి ఉంచాను,
మరుజన్మకైనా వచ్చి చూసుకో,
నీ చిరునవ్వులకు కరిగి నిను దరి చేర్చుకుంటుంది,
నా నిరీక్షణ ఫలించిందని ఆనందిస్తుంది.
అదే ప్రేమతో ..

Subscribe to:
Posts (Atom)