Monday, November 2, 2009

నిను చూడాలనే ఆశతో....

నిను మరొకసారి చూడాలనే ఆశతో
ఏడు గంటల ఎదురుచూపులు, అడవికాసిన వెన్నెలైపోయిందే అన్న నిరాశతో తిరిగి వెల్తున్న నాకు,
నీ ప్రాణమిత్రుడు కనపడినప్పుడు,
తప్పకుండా నువ్వుకూడా కనిపిస్తావు అనే ఆశ నాలో మళ్ళీ జీవం పోసుకుంది.

నీకోసం ఎదురుచూస్తూ, నీ మాటకై వేచి ఉన్న నాకు నీవు
మహాలక్ష్మిలా చీరలో కనపడి క్షణం.
నను నేనే మైమరచి నీ వెనుకే నిను నీడలా వెంటాడుతూ... వస్తూ ఉండగా!
నను వీడని నా గతం, నాకు గుర్తు చేసింది.. మొదటి సారి చీరలో నాతో బయటకు వచ్చిన సంగతి.

:) ఏమి చెయ్యను?
నాతో మాట్లడవు, నను కలవవు, కనీసం నను చూస్తావేమో అని నీ పక్కకు వచ్చినప్పుడు.. నీ కల్లలో ఆ చిరాకు... నను నిలువెల్లా దహిస్తుంటే..
మళ్ళీ నిను వెంటాడలేక వెళ్ళిపోయాను...

:) నువ్వు ఇంటికివెళ్ళాక ఒక SMS అన్నా పంపిస్తావేమో అని చూసిన నాకు మళ్ళీ నిరాశే మిగిలింది.
నీ SMS కూడా రాదని తెలిసినా... ఇప్పటికీ చూస్తున్నా.. :)

ఇపుడు నా హ్రుదయం నను గేలి చేస్తూ నను అడుగుతుంది..
"మరీ ఇంత బండరాతినా నువ్వు ప్రాణం కన్న మిన్నగా ప్రేమించింది?" అని

No comments:

Post a Comment